సుమధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి దాదాపుగా భారతీయ సినిమా ప్రపంచంలో తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా తనదైన సుమధుర గాత్రంతో ఎందరో అభిమానులని సంపాదించిన శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహమణ్యం గత ఏడాది మహమ్మారి కరోనా బారిన పడి ఆ తరువాత ఆరోగ్యం మరింతగా విషమించి సరిగ్గా ఇదే రోజున తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక బాలు గారి పాట వింటుంటే మనసుకు కలిగే హాయి ఆనందం నిజంగా వర్ణింపనలవి కానిది.
కెరీర్ తొలినాళ్లలోనే అప్పటి యువ నటులతో పాటు స్టార్ హీరోలకి సైతం ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడి శభాష్ అనిపించుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆ తరువాత పలు ఇతర భారతీయ భాషల్లో సైతం పాటలు పాడారు. ఇక అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా దాదాపుగా అన్ని భాషల్లోను ఆయన పాటలకు పరవశించిపోయే విశేషమైన అభిమానగణం ఉన్నారు. ఇక మొదటి నుండి ఎంతో మంచి మనస్తత్వంతో పాటు మృదు స్వభావి అయిన బాలసుబ్రహ్మణ్యం జీవించి ఉన్నసమయంలో తరచు తన సినిమా కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ తో జరిగిన వివాదాన్ని ఆ తరువాత తామిద్దరి మధ్య వచ్చిన కొన్నేళ్ల గ్యాప్ ని తలచుకుంటూ కొంత ఆవేదన వ్యక్తం చేసేవారు. నిజానికి ఆ ఘటనలో తనది కానీ, కృష్ణ గారిది కానీ ఏ మాత్రం తప్పులేదని, అప్పట్లో ఎవరో మధ్యన ఉన్న వారు కొందరు ఏవో చెప్పడం, అది కృష్ణ గారికి నచ్చకపోవడంతో అక్కడి నుండి తామిద్దరి మధ్య కొన్నేళ్ల గ్యాప్ వచ్చిందని అన్నారు.

అయితే బాలు చివరి రోజుల్లో హాస్పిటల్ లో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణట్ తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని ప్రత్యేకంగా సీనియర్ నరేష్ కి ఫోన్ చేసి మరీ మాట్లాడారట. అప్పటి వివాద ఘటన విషయమై మీరు నా వల్లన ఏదైనా ఇబ్బంది పడి ఉంటె క్షమించండి, ఎందుకో మీతో చివరిగా మాట్లాడితేనే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు అనిపించి ఫోన్ చేశాను అంటూ బాలు గారు పలికిన మాటలు కృష్ణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ కంటనీరు తెప్పించిందట. ఇక నేడు ఆ మహానుభావుడి ప్రధమ వర్ధంతి కావడంతో పలువురు ప్రేక్షకులు, అభిమానులు, కుటుంబసభ్యులు బాలు గారిని తలచుకుని ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: