సూపర్ స్టార్ మహేష్ నుండి నెక్స్ట్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వేగవంతంగా ఒకదాని వెంట మరొకటి వరుసగా షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమా చాలా వరకు పూర్తి అయిందని, ముందుగా తాము ప్రకటించిన విధంగానే దీనిని వచ్చే ఏడాది పక్కాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అంటూ మొన్న ఒక ఈవెంట్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ చెప్పారు.

అది మాత్రమే కాక, ఈ మూవీ గతంలో తన కెరీర్ లోని అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి రేంజ్ లో ఎంతో అద్భుతమైన స్టోరీ లైన్ తో తెరకెక్కుతోందని మహేష్ వెల్లడించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ తీస్తున్న ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో నెక్స్ట్ మూవీ చేయనున్నారు మహేష్ బాబు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించించనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, దీనిని ఎస్ రాధాకృష్ణ, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. మహేష్ తో రెండవ సారి పూజా జోడీ కడుతున్న ఈ సినిమాని భారీ యాక్షన్ అంశాలతో కూడిన పక్కాగా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించనున్నారని ఇన్నర్ వర్గాల టాక్.

ఇక విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇటీవల ప్రారంభం కాగా, కొద్దిరోజుల నుండి రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ కోసం దాదాపుగా రూ.8 కోట్ల తో ఒక పెద్ద భవంతి సెట్ ని రూపొందిస్తోందట యూనిట్. దీని కోసం పలువురు దిగ్గజ టెక్నీషియన్స్ ని పిలిపించి మరీ ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నారట. కాగా ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి గతంలో మహేష్ తో అతడు తీసి సూపర్ కొట్టి, ఆపై ఖలేజా తీసి ఫ్లాప్ చవిచూసిన త్రివిక్రమ్, ముచ్చటగా ఈ మూడవ సినిమాతో ఆయనకు ఏ స్థాయి విజయాన్ని అందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: