తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని అందరికి తెలిసిన విషయమే.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందని తెలుస్తుంది.. ఆయన సినిమాలో నుంచి విడుదల చేసే టీజర్లుమరియు పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్థాయిలో వుంటాయట. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఏదో మాయ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని సమాచారం.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ చాలా భారంగా సాగినట్టు సమాచారం. లవ్ స్టోరీ సినిమాలో సెకండ్ హాఫ్ కులమతాలు లైంగిక వేధింపుల మధ్య సాగడంతో ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించిందని తెలుస్తుంది.సెకండ్ హాఫ్ లో శేఖర్ కమ్ముల మార్క్ ఏదో మిస్ కావడంతో ఆ లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుందని తెలుస్తుంది. ఇలా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరాశ పరచడం వల్ల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని తెలుస్తుంది. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలు కూడా ఇదే ఈ విధంగా ప్రేక్షకులను నిరాశ పరిచాయని సమాచారం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు ఫస్ట్ హాఫ్ ఎంతో సందడి చేసిన సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ విధమైనటువంటి లోపాలు ఉండటం వల్ల ప్రేక్షకులను నిరాశ పరుస్తాయని తెలుస్తుంది. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా పరిస్థితి కూడా అదేనని, ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సెకండాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విధంగా శేఖర్ కమ్ముల సెకండ్ హాఫ్ గ్రాఫ్ అమాంతం పడిపోవడం తన వీక్ నెస్ అని తెలుస్తుంది. ఇలా లవ్ స్టోరీ సినిమా సెకండ్ హాఫ్ సాగదీయడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: