పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోయి మాట్లాడారు. సినిమా ఫంక్షన్ అనుకున్నది కాస్తా పొలిటికల్ ఫంక్షన్ లా తయారయింది ఆయన స్పీచ్ విన్న తర్వాత. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై మరియు ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధి విధానాలు చిత్ర పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమా పరిశ్రమ ను నా వల్ల టార్గెట్ చేయడం తనకు ఎంతగానో బాధ కలిగిస్తుందని అన్నారు. అంతే కాదు ఓ ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ ను సన్యాసిగా పోల్చారు. తన ఒక్కడి కోసం సినిమా పరిశ్రమ మొత్తం ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కావాలంటే నన్ను నా సినిమాలను బాన్ చేసుకోండి అంతేగాని సినిమా పరిశ్రమకు మాత్రం అన్యాయం చేయవద్దని ఆయన వేడుకొన్నారు. అంతే కాదు పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని సినీ పెద్దలకు కూడా పవన్ చెప్పారు.  

చిరంజీవి గారు వాళ్లని ఎందుకు అడుకుంటున్నారని, తిరగబదాంది.. ప్రశ్నించండి అని ఆయన వెల్లడించారు.  సోదర భావం ఎందుకు దాన్ని తీసుకెళ్లి ఆయన చెత్త లో వేయండి అని విరుచుకుపడ్డాడు. నేను అన్నిటికీ తెగించి మాట్లాడుతున్నాను అని ఇండస్ట్రీలోని కొంత మంది వైసీపీ నాయకులను కూడా ఆయన విమర్శలు చేశారు. మా వంశాలు వేరు అని చెప్పుకునే వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని అన్నారు. సాయి ధరమ్ తేజ్ మొదటి నుంచి అవకాశాలు వస్తున్నాయి ఆయన మీద ప్రోగ్రాములు చేయడం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటి వాటి మీద ప్రోగ్రాములు చేయండి అని ఆయన తన స్పీచ్ తో అదరగొట్టాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: