సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి వ్యక్తులకు మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వానికి ప్రాధేయ పడొద్దని చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.  మోహన్ బాబు గారూ..మీ బంధువులు కదా వైఎస్ జగన్ కుటుంబం... ఇపుడు తెలుగు సినిమా విషయంలో స్పందించకపోతే.. విషయం మీ విద్యానికేతన్ వరకు వస్తుందని హెచ్చరించారు పవన్.  సినిమా టికెట్లు అమ్మగా వచ్చే డబ్బుని చూపి అప్పు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన  చేస్తోందని.. మేము కష్టపడి సినిమాలు తీస్తే.. మీరు టికెట్లు అమ్ముతారా ? అని చురకలు అంటించారు పవన్ కల్యాణ్.  

మీడియా పైనా కూడా పవన్ స్టైల్ చురకలు అంటించారు.  వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో మీడియాలో స్టోరీ లు వేయాలని... కానీ తేజ్ యాక్సిడెంట్ పైన కాదన్నారు. అంతేకాదు.... ఆరేళ్ళ చిన్నారి చైత్ర ఎలా చనిపోయిందో సమాజానికి చూపించాలని... మేము డబ్బులు పెట్టి సినిమా తీస్తే మీరు సినిమా టికెట్లు అమ్ముకుంటారా ? అని ఏపీ సర్కార్‌ పై  ఫైర్‌ అయ్యారు పవన్ కళ్యాణ్.    సినిమా పరిశ్రమ సెన్సిటివ్ పరిశ్రమ అని... పవన్ సనిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మేం అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం లేదని... కష్టపడి నటిస్తేనే మాకు డబ్బులు వస్తాయన్నారు.  

అక్రమార్జిత రాజకీయ నాయకుల గురించి మాట్లాడండని.. ట్యాక్స్ లు కట్టని వారి గురించి మాట్లాడండి.. మా గురించి కాదని చురకలు అంటించారు.   చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ వాళ్లు కాలిపోతారని.... ఇండస్ట్రీ వైపు చూడొద్దని వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.  అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు అని మనం చెప్పాలని... ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటి? అని నిలదీశారు.  ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని... ఇది వైసీపీ రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హెచ్చరించారు. సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవని... సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి?వెల్లడించారు.   సినీ పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలని... నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తానన్నారు పవన్‌ కళ్యాణ్‌.   తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు.. ఆపలేరని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: