బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఇంకా ఈయనకి ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల తమ స్నేహితులు చాలా ఇబ్బంది పడుతుంటారట. షారుక్ ఖాన్ కు ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఏ పని సరిగ్గా అవ్వడం లేదని.. అనుకున్న ప్లాన్ లు అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు ఈ స్టార్స్ స్నేహితులు. అయితే ఈ హీరో కి ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో చూద్దాం.


ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో బ్యాడ్ హాబిట్స్ ఉండటం సహజం..అలాగే  షారుక్ ఖాన్ బాడ్ హ్యాబిట్ ఏమిటంటే..నిజానికీ  ఎవరైనా పార్టీ అనగానే ఎగిరి గంతేసి, చెప్పిన సమయం కన్నా ముందే హాజరవుతారు.. కానీ బాలీవుడ్ లో టాప్ హీరో అని అనిపించుకుని కూడా షారుక్ మాత్రం పార్టీ అంటే ఎప్పుడు లేట్ గానే వస్తాడు.. లేట్ అంటే మామూలు లేటు కాదు.. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్డు మొత్తం అయిపోయి, ఫ్రెండ్స్ వెళ్ళిపోయి పని వాళ్లు కూడా నిద్ర పోయిన తర్వాత హాజరయ్యే అంత లేటు అన్నమాట. షారుక్ ఖాన్ కు ఉన్న ఈ అలవాటు వల్ల ఆయన స్నేహితులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు..

ఒకసారి తన ఫ్రెండ్ జూహీ చావ్లా.. ఇంటికి 10 గంటలకు పార్టీ కి రమ్మని పిలిస్తే , షారుక్ ఖాన్ ఏకంగా 2:30 కి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడట.. స్నేహితులు , పనివాళ్ళు ఇలా  అందరూ వెళ్ళిపోయి నిద్రపోతున్న సమయంలో ఆయన పార్టీకి రావడంతో అందరూ ఒక్కసారిగా టైం సెన్స్ లేదా అంటూ తెగ తిట్టుకున్నారట.. షారుక్ కోసం ఏర్పాటు చేసే పార్టీకి  షారుక్ ఖాన్ లేటుగా వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అంటూ.. ఆయన స్నేహితులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇకపోతే ఒక్కోసారి అందరికంటే ముందే హాజరై అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.. పార్టీలకు మాత్రమే లేటుగా హాజరవడం కాదు సినిమాలు కూడా చాలా లేటు గానే పూర్తి చేస్తున్నాడు.. ఈయన నటించిన జీరో సినిమా తర్వాత  కూడా దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.. మరీ ఇంత లేట్ అయితే ఎలా షారుక్ అంటూ ఆయన అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: