1948 అక్టోబర్ 17వ తేదీన కృష్ణా జిల్లాలోనీ బెజవాడలో ఈమె జన్మించారు. ఇక ఈమె అసలు పేరు ఉమా. ఈమెకు చదువంటే మహా భయం.. ఆ కారణం చేతనే ఆరవ తరగతి వరకు బెజవాడ లో చదువుకున్నారు. మొదటి సారి తెనాలి లో ఉన్నప్పుడు ఒకతను నాటకాల కోసం అన్నపూర్ణ ను తీసుకెళ్లి , దర్శకుడికి పరిచయం చేశారు. ఇక మొదటి నాటకం తోని మంచి ఆదరణ పొందిన అన్నపూర్ణ ఆ తర్వాత వరుసగా నాటకాలు వేయడం మొదలుపెట్టింది. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళమ్మ పని చెబుతుందని కారణంగా, అవకాశాలు లేకపోయినా నాటకాలు వేసే సీనియర్ ల దగ్గరికి వెళ్లి నటన నేర్చుకున్నారు. అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే మురళీమోహన్ , జంధ్యాల పరిచయం అయ్యారు.ఆ తర్వాత మద్రాస్ వెళ్లి నాటకాలు వేయడం మొదలుపెట్టింది. నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శకుడి చూసి , ఆమెను ఆఫీస్ కు తీసుకు రమ్మని నాటక నిర్వాహకులకు తెలియజేశారు. ఇక తర్వాత అన్నపూర్ణ ఆఫీస్ కి వెళ్లినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఏదో లాగా చూడడంతో..ఆమె సినిమాలు వద్దు.. ఏమి వద్దు.. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత నవశక్తి గంగాధర్ అందరూ కొత్తవాళ్లతో నీడలేని ఆడది అనే సినిమాలో చిత్రీకరించడం కోసం నటుల కోసం వెతికారట.మురళీమోహన్ కూడా ఈ సినిమా ఆడిషన్స్ కి కోసం వెళ్లినప్పుడు అన్నపూర్ణకు కూడా చెప్పాడట. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఇక మురళీమోహన్ సినీ ఇండస్ట్రీలో అవన్నీ సహజమని , నెట్టుకొని వెళ్ళినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రోత్సహించి సినిమా ఆడిషన్స్ కి వెళ్ళమని చెప్పారు. తల్లితో కలిసి అన్నపూర్ణ ఆడిషన్స్ కి హాజరయ్యింది. 1974లో ఆహుతిప్రసాద్ కు భార్య పాత్రలో ఎన్నికైంది అన్నపూర్ణ. ఇక ఆ తర్వాత నవశక్తి గంగాధర్ సహాయంతోనే ఆమె సినీ ఇండస్ట్రీలోకి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

అలా అంచెలంచెలు గా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రముఖ స్టార్ హీరో చిరంజీవి తల్లి పాత్రలో ఎన్నో సినిమాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణ, తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా కొనసాగిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమెకు సాటి మరెవరూ రారు అని కూడా చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: