ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు పరిచయం అవుతుంటారు. వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు కాలం కలిసిరాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆలా వచ్చిన వెళ్లిన హీరోలలో నటుడు హీరో రోహిత్ ఒక్కరు. ఆయన ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలలో నటించినప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సిక్టీన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువత గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రభంజనం సృష్టించాడు.

ఇక రోహిత్ చివరి సారిగా మా అన్నయ్య బంగారం సినిమాలో నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన చిత్ర పరిశ్రమకి దూరమైయ్యారు. రోహిత్ అప్పట్లో స్టార్ హీరోగా ఎదుగుతాడు అని అనుకున్న సమయంలోనే, బడా హీరోల వారసులు, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరు. అయితే రోహిత్ ఎక్కడ స్టార్ హీరో గా ఎదుగుతాడేమో అని కొంతమంది, బడా హీరోలు ఇతనిని తొక్కేసారు అనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన రోహిత్ ఏం అన్నారో ఒక్కసారి చూద్దామా.

అయితే రోహిత్ మాట్లాడుతూ.. నేను ఎక్కువగా నిర్మాతలను అలాగే డైరెక్టర్ ల కంటే కథనే బాగా నమ్ముతానని అన్నారు. ఇక కథ ఎంత బాగుంటే సినిమా చేయడానికి అంత ఇష్టపడతానని అన్నారు. కాగా.. ఆ సమయంలో నాకు డైరెక్టర్లు ఎన్నో కథలను వినిపించినప్పటికీ తనకి  నచ్చకుంటే దర్శకుడితో డైరెక్టర్ గా కథ నచ్చలేదని చెప్పేవాడంట. దాంతో ఆయనకీ సినిమా అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పుకొచ్చారు. కాగా.. రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ' కళాకార్ ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా, మనకు కనిపించబోతున్న విషయం తెలిసిన విదితమే. ఇక ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: