తెలుగు సినిమా పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ జయప్రద. 1962వ సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించిన ఈమె అసలు పేరు లలితారాణి కాగా సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత జయప్రద తన పేరు మార్చుకుంది. పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్న ఈమె నటన తోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన తర్వాత ఆమె సినీ నిర్మాత శ్రీకాంత్ నహతా ను వివాహమాడింది.

చిన్నప్పటి నుంచి జయప్రదకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే ఆమె 7 వ ఏటా నాట్య సంగీత శిక్షణకు వెళ్ళింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.  తండ్రి బాబాయిలు పెట్టుబడిదారులు అయినప్పటికీ ఆమె సినీరంగ ప్రవేశం వారిద్వారా చేయలేదు. పద్నాలుగేళ్ళ వయసులో నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమెను చూసి జయప్రద గా నామకరణం చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాల నిడివి గల పాట  ద్వారా ఆమెను చిత్రసీమకు పరిచయం చేశాడు.

అలా మొదలైన ఆమె ప్రస్థానం 2005 వరకు కొనసాగింది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. నందమూరి తారక రామారావు ఆహ్వానంతో ఆమె రాజకీయాల్లోకి 1994 అక్టోబర్ 10న వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఈమె రాజకీయ ఓనమాలు నేర్చుకుని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగమునకు అధ్యక్షురాలు అయింది. 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన ఆ పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ ని రాంపూర్ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: