తెలుగు సినీ పరిశ్రమలో ఆర్టిస్టులుగా వచ్చి.. హీరోలుగా ఎదిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాగే హీరోలుగా కొనసాగిన వారు దర్శకులుగా మారిన వారూ ఎక్కువే ఉన్నారు. హీరోలుగా తమ నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పించారో.. దర్శకులుగా కూడా అంతే సక్సెస్‌ను అందుకున్నారు. ఒక దర్శకుడు హీరోల పాత్రను ఎంత చక్కగా రూపుదిద్దితే.. ఆ సినిమా కూడా అంత సక్సెస్ అవుతుంది. ఇందులో దర్శకులు హీరోల పాత్రపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇండస్ట్రీలో కేవలం స్టార్ హీరోలను బేస్ చేసుకుని స్టోరీలు తయారవుతున్నాయనే వార్తలు ఇప్పటికీ మనం వింటూ ఉంటాం. నటనలో, డైరెక్షన్‌లో ప్రావీణ్యతను పెంపొందించుకుంటారు. అయితే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమై దర్శకులుగా మారిన వారి గురించి ఈ రోజు టాపిక్‌లో తెలుసుకుందాం.

కే.విశ్వనాథ్..
ప్రముఖ దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతిముత్యం, స్వయంకృషి ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తన సత్తాను చాటారు.  


దాసరి నారాయణ రావు..
విలక్షణ నటుడు దాసరి నారాయణ రావు తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం. ఒసేయ్ రాములమ్మ, మామగారు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కనేనన్ని సినిమాల్లో నటించారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత రచయిత, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. కేవలం తెలుగు సినీ పరిశ్రమకే పరిమితం కాకండా పలు సినీ ఇండస్ట్రీలో పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


వీ.వీ. వినాయక్..
సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోలను పరిచయం చేయాలంటే వీవీ వినాయక్ తర్వాతే ఎవరైనా. చిన్న హీరోలతోపాటు స్టార్ హీరోల సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఠాగూర్, ఖైదీ నంబర్.150 వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వీవీ వినాయక్ పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: