తెలుగు కన్నడ తమిళ మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్ ప్రేమ. ఆమె నటించిన ఓం, యజమాన సినిమాలు కన్నడ సినీ రంగంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలవగా రెండు దశాబ్దాల సినీ జీవితంలో ఎంతో మంది సరసన నటించి ప్రేక్షకులను వారి అభిమానులను అలరించింది.  కన్నడలో మలయాళంలో తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

విష్ణువర్ధన్ మోహన్ బాబు మోహన్ లాల్ దగ్గుబాటి వెంకటేష్ జగపతి బాబు కృష్ణ శివరాజ్ కుమార్ రవిచంద్రన్ ఉపేంద్ర సాయి కుమార్ రమేష్ అరవింద్ వంటి అగ్ర హీరో లతో ఆమె ఎక్కువగా నటించింది. 1977వ సంవత్సరంలో బెంగుళూరులో జన్మించిన ఈమె 2006లో జీవన్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఆమె విడాకులు తీసుకోగా ప్రస్తుతం ఒంటరిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది ప్రేమ.  ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ను కొనసాగిస్తున్న ప్రేమ 9 అవార్డును అందుకుంది.

వీటిలో నంది అవార్డు కూడా ఉండడం విశేషం..తెలుగు లో వచ్చిన దేవి చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు గాను 1997వ సంవత్సరంలో ఆమెకు నంది అవార్డు లభించింది. ఓంకారం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు మరియు తూర్పింటి చిత్రానికి కూడా ఆమె ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తూ మంచి మంచి పాత్రలు చేసుకుంటూ వెళుతుంది. సవ్యసాచి అంజనీ పుత్రుడు శిశిర కృష్ణార్జున సుందరాకాండ వంటి చిత్రాలలో ఆమె నటిస్తుంది. ఇకపోతే ప్రేమ తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు తెలుగులో చేస్తానని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పగా ఆమె భవిష్యత్తులో ఎలాంటి సినిమా లను చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: