బాల నటిగా సినిమాల్లోకి ప్రవేశించి నాయకి గా ప్రతినాయకిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరోయిన్ రాశి. గోకులంలో సీత శుభాకాంక్షలు వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకుని కొన్ని సంవత్సరాలు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంది. తమిళంలో మంత్ర అనే పేరుతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. శీను సముద్రం వెంకీ లాంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా ఈమె నటించి ప్రేక్షకులను అన్ని విధాలు గా మెప్పించింది.

1976 వ సంవత్సరంలో జన్మించిన ఈమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. ఆయన కూడా సినిమా లలోనే చేసే వాడు. మొదట్లో బాలనటిగా నటించిన ఈమె పదో తరగతి దాకా మాత్రమే చదివి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బీయే కూడా పూర్తి చేసింది. అందానికి అందం అభినయానికి అభినయం కలగలిపి నటించే ఈమెకు పెళ్లి పందిరి సినిమాతో గొప్ప గుర్తింపు దక్కించుకుంది.

విజయ పేరుతో పుట్టి పెరిగిన ఈమె సినిమాల్లోకి వచ్చి రాశి గా పేరు మార్చుకుంది. ఆ తర్వాత ఆ పేరు యువత గుండెలను ఎంతగా కొల్లగొట్టిదో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె డైరెక్టర్ శ్రీ ముని నీ వివాహం చేసుకొని ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో సంతోషం గా ఉంది. మొదటి నుంచి ఈమె ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.  హిందీ సినిమాలు కూడా చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈమె సీరియల్లో కూడా కనిపించడం మొదలుపెట్టింది. గిరిజా కళ్యాణం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ తో ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూనే ఉంది రాశి. మరి భవిష్యత్ లో ఆమె ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: