ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమను లవ్ స్టోరీ సినిమా బ్రతికిస్తుందని చెప్పాలి. ఈ సినిమా కలెక్షన్లు భారీగా వసూలు అవుతుండడంతో సినిమా థియేటర్లకు పూర్వ వైభవం వచ్చిందని చెబుతున్నారు. కరుణ కారణంగా రెండు సంవత్సరాలుగా సినిమా థియేటర్లు ప్రేక్షకులు లేక మూగబోయాయి. అలాగే కొన్ని రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మంచి సినిమాలు రావడం లేదని బాధ పడుతున్న తరుణంలో సిటీమార్ మరియు లవ్ స్టోరీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్స్ తో దూసుకుపోతున్నాయి. 

అలా నిన్న విడుదలై సూపర్ హిట్ గా దూసుకుపోతున్న లవ్ స్టోరీ చిత్రంపై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు కూడా స్పందించడం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. పలువురు సెలబ్రిటీలు అక్కినేని నాగచైతన్య ఎంతో బాగా నటించాడని పోగడడమే కాకుండా సినిమా కూడా సూపర్ హిట్ అని చెబుతూ సినిమా ఇండస్ట్రీ ఎదగడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు ఈరోజు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా కొంతమంది దర్శక హీరోలు హీరోయిన్ లు కూడా సినిమా గురించి ట్వీట్ లు పెట్టి తమ విషెష్ తెలియజేశారు.

రవితేజ మహేష్ బాబు సత్యదేవ్ పి.సి.శ్రీరామ్ వెన్నెల కిషోర్ సిద్ధార్థ అల్లరి నరేష్ నాని నాగ శౌర్య సందీప్ కిషన్ మంచు మనోజ్ రాహుల్ విజయ్ లక్ష్మీ మంచు క్రిష్ జాగర్లమూడి అమల అక్కినేని శివ నిర్వాణ కీర్తి సురేష్ బాబి గోపీచంద్ మలినేని సందీప్ రెడ్డి వంగా వరుణ్ తేజ్ అక్కినేని అఖిల్ హను రాఘవపూడి రాశికన్నా దుల్కర్ సల్మాన్ వంటి వాళ్లు ఈ సినిమా గురించి ట్విట్టర్లో పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కగా సాయి పల్లవి నటన హైలెట్ గా ఈ సినిమా ఉందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పవన్ అందించిన పాటలు ఈ సినిమా కు ప్లస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: