విక్టరీ వెంకటేష్ ఇటీవలే నారప్ప సినిమాతో సూపర్ హిట్ అందుకొని ప్రస్తుతం తన తదుపరి చిత్రం దృశ్యం2 ను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన దృశ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న దృశ్యం2 సినిమా కి తెలుగు రీమేక్ కాగా తెలుగు లో వచ్చిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. దృశ్యం వన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో దృశ్యం పార్ట్ 2 చిత్రాన్ని మలయాళం లో చేశారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

తెలుగులో కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని వెంకటేష్ గ్రహించి ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు దృశ్యం2 సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. కొన్నిసార్లు ఈ సినిమా విడుదల థియేటర్ లో అవుతుంది అని చెబుతుంటే, ఇంకొన్నిసార్లు లేదు ఓ టీ టీ విడుదల అవుతుందని చెబుతున్నారు. అయితే విడుదల తేదీ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో తెలియదు కానీ వెంకటేష్ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక దసరా కి ఈ సినిమా విడుదలవుతుందని కొంతమంది చెబుతుండగా అది కూడా థియేటర్లలో విడుదల అవుతుందని కొంతమంది చెబుతుండగా లేదు ఇప్పుడు ఈ సినిమా ఓ టీ టీ లోని రాబోతుందని చెబుతుండడం అందరికీ అసహనానికి గురిచేస్తుంది. దీనిపై చిత్ర బృందం ఎలాగైనా తొందర్లోనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండగా తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం యొక్క రైట్స్ ను కొనుగోలు చేసిందని టాక్ నడుస్తుంది. మొత్తానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుందని క్లారిటీ వచ్చేస్తుంది. మరి విడుదల ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: