నిన్న రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆవేశంగా ఊగిపోయారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కాబోతుండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ హాజరయ్యారు. బైక్ యాక్సిడెంట్ కారణంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్ర ఫంక్షన్ కు హాజరు కాలేక పోగా ఆయన తరఫున పవన్ కళ్యాణ్ వచ్చి సాయి ధరంతేజ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ గంటకు పైగా ఈ ఫంక్షన్ లో మాట్లాడగా ఈ ప్రసంగంలో పరిశ్రమలోని పెద్దలు మీడియా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల తో అందరిలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు పవన్. నిర్మాతలకు చేటు చేసే విధంగా గా  ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని వారిని గట్టిగా ప్రశ్నించాలని ఆయన వాదించారు. అంతేకాదు నిర్మాత దిల్ రాజు పై కొన్ని కామెంట్లు చేశారు. నువ్వు సీఎం జగన్ రెడ్డి ఇద్దరు రెడ్డి కదా మీరు మీరు తేల్చుకోండి.. అని మాట్లాడుతూ ఆయన విరుచుకు పడ్డారు. 

దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడు అని ఆయన అన్నారు. వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావు అదే లేకుంటే ఇప్పుడు అన్ని సినిమాలు చక్కగా విడుదల అయేవి ఏపీలో అంటూ ఆయన ప్రశ్నించారు. వెల్త్ క్రియేషన్ లేకుంటే నేనైనా ఎవరైనా దానాలు ఎలా చేయగలుగుతారు.. సంపాదిస్తున్నారు.. సంపాదిస్తున్నారు.. అంటున్నారు సంపాదించకపోతే ధానాలు ఎవరైనా చేయగలరా అని పవన్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆడబిడ్డలు హీరోయిన్ గా ఎదగడానికి కొనసాగడానికి దేశంలో ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడ ఉన్న వస్తారు.. వాళ్ళకు డబ్బులు ఇస్తున్నామని విమర్శిస్తారా.. అసలు ఈ వెల్త్ క్రియేషన్ లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: