ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వికృత పరిణామాలను చూసి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక లో ఆగ్రహంగా ప్రసంగించారు. అక్కడ సినిమా పరిశ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు. సినిమా టికెట్లు తానే ఇస్తామన్న ప్రభుత్వం చేసే ఈ అక్రమాలను అడ్డుకోవాలని ఆయన చెప్పగా ఇండస్ట్రీ లోని వైసిపి నాయకులు దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అన్నారు.  ముఖ్యంగా ఆయన మోహన్ బాబు ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు మన సినిమా పరిశ్రమకు వచ్చింది. రేపు మీ దాక వస్తుంది అని మోహన్ బాబు ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేపు మీ విద్యాసంస్థలను తామే నడుపుతామని అంటారేమో.. మీ కాలేజీ లను జాతీయం చేయొచ్చు. జగన్ సర్కార్ లో నిధులు లేవు అందుకే ఈ విధమైన వికృతమైన చేష్టలు చేస్తున్నారు.  సినిమా టికెట్లు ను అమ్మి దాంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందే ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో సినిమా హాలు ఉన్నాయి. ఏపీ లో లేవు.  చిత్ర పరిశ్రమలో ఉన్న మోహన్ బాబు వైసిపి నాయకులకు చెప్పండి అని చెప్పారు.

సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్లు చాలా పన్నులు కడుతున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై వైసీపీ వైఖరి మారకపోతే వారిని ఎలా గద్దె దించాలో మాకు తెలుసు. చిత్ర పరిశ్రమకు జగన్ చేసింది ఏమీ లేదు. సినిమా పరిశ్రమ సున్నితమైనది. పవన్ కళ్యాణ్ పై కోపం వేస్తే రానీయండి కానీ ఇక్కడ లక్ష మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ పై దాడులు చేసిన రౌడీ చరిత్ర వైసిపి దీ.. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్న అని చెప్పారు. సినీ ఇండస్ట్రీ తో పెట్టుకుంటే కాలిపోతావ్.. మమ్మల్ని తిడితే ఊరుకుంటాం అనుకోవద్దు.. బయటకు లాగి తంతాం అని అన్నారు. నేను అడ్డగోలుగా సంపాదించలేదు. కష్టపడి సినిమాల్లో నటించి సంపాదించాను అని ఆయన చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: