రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. తన స్థాయికి మించి వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు విష పాలన చేస్తుందని ఆయన విమర్శించారు. ఆయన జగన్ నే టార్గెట్ చేశాడని కనిపిస్తూ ఉండగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై లేనిపోని అవాస్తవాలను కథనాలను ప్రసారం చేసిన మీడియా సంస్థలకు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ అవినీతి కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు.

అంతేకాదు చిత్ర పరిశ్రమ వైపు చూస్తే మాడి మసై పోతారని జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు ఎందుకు కథనాలు రాయడం లేదని అన్నారు. సినిమా వారు సినిమా వ్యాపారం చేసుకోకూడదా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని నిలదీశారు. సినిమా చిన్నదైనా పెద్దదైనా దాని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని ఆయన చెప్పారు.  ఆంధ్ర ప్రదేశ్ లో కులం పరంగా బంధాలు పంచుకోలేదు. అందరితో కలిసిమెలిసి బ్రతుకుతూ అనుబంధాలు పెంచుకున్నాను అని ఆయన అన్నారు.

మేము సినిమా తీస్తే మీరు టికెట్లు అమ్ముకుంటారా.. అమ్మడానికి మీరెవరు అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నిధులు లేక సినిమా టికెట్ లు అమ్మి తమ ఆదాయాన్ని చూపించి రుణాలు తీసుకోవాలని ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే చిరంజీవి కి కూడా ఆయన చురకలు అంటించారు. సోదర భావంతో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమలోని సమస్యలు ఎందుకు సాల్వ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ జగన్ ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అన్నరుం మనమంతా ఇండియన్ రిపబ్లిక్ లో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ ఫంక్షన్ లో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా గురించి మాట్లాడడం మాత్రం పవన్ మర్చిపోయారని చెప్పవచ్చు. సినిమా ధియేటర్ లకు ప్రేక్షకులు రాని నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా వారిని తీసుకు రావడం లో సక్సెస్ అయింది. దానికి గురించి ఒక వ్యాఖ్య చెప్తే బాగుందేదని అభిమానులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: