సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ వన్నె తరగని అందంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రముఖ నటి ప్రగతి.. ఈమె కేవలం సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఇక ఈమె పూర్తిపేరు ప్రగతి మహావాడి.. 1976 వ సంవత్సరం మార్చి 17వ తేదీన ఉలవపాడు.. ప్రకాశం జిల్లాలో జన్మించింది. తన చదువును డిగ్రీ వరకు పూర్తి చేసి, ఆ తర్వాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ లో మోడల్ గా నటించడానికి మొదట నట జీవితాన్ని మొదలు పెట్టింది.

ఇక ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా టీవీ సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సినిమాల ద్వారానే ఎక్కువగా గుర్తింపు పొందింది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ భాషలలో కూడా నటించింది. ఇక నటి ప్రగతి కి ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు.. అయితే భర్త నుంచి దూరం అయిన తర్వాత ఈమె కొడుకు ,కూతురు తో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక ఆమెను మొదటిసారి  హీరోయిన్‌గా భాగ్యరాజ్  సినీ పరిశ్రమకి పరిచయం చేశారు . కానీ అప్పటికే ఆమె ఏడు తమిళ చిత్రాలతో పాటు  ఒక మలయాళ చిత్రంలో నటించింది.

ఇక వివాహం అయినా తర్వాత సినీ ఇండస్ట్రీకి దాదాపు 3 సంవత్సరాల పాటు దూరంగా వుంది.. ఆ తర్వాత బుల్లితెరపై దర్శనం ఇచ్చింది.తెలుగులో ఏకంగా 103 పై చిలుకు సినిమాలలో నటించి,తమిళ్ లో 23 చిత్రాలు, మలయాళం లో 2 సినిమాలలో నటించింది.బుల్లితెరపై జెమినీ టీవీ లో నాతి చరామి,మమతల కోవెల వంటి సీరియల్స్ తో పాటు..తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే ఏమైంది ఈవేళ సినిమాతో ఉత్తమ సహాయకురాలిగా నంది అవార్డును గెలుపొందింది. కల్యాణ వైభోగమే సినిమా రారా ఉత్తమ హాస్య మహిళా నటిగా నంది అవార్డు కైవసం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: