తాజాగా సాయి ధర్మ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనసేన అధినేత పవన్ ముఖ్య అథితిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుక దాదాపు రాజకీయ ప్రస్థానం మాదిరిగానే గడిచిపోయింది. పవన్ ఏ వేడుకకు హాజరైనప్పటికీ చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ ఈసారి వేడుకలో మాత్రం ఆ పరిస్థితి మారింది. అసలు అది సినీ వేడుక, ఇలాంటి వేడుకలలో సినిమా గురించే మాట్లాడుతారు. ఎప్పుడైనా కాస్త ఇతర విషయాలు అది కూడా సినీ విషయాలు మాత్రమే జ్ఞాపకానికి తెచ్చుకునేవారు. ఈసారి పవన్ తనలో ఉన్న అసహనంతోనే ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తుంది. అందుకే అదంతా వైసీపీ ని తిట్టడానికే బాగా వాడేసుకున్నాడు.

ఇక మెగా ఫాన్స్ అంటేనే కాస్త క్రమశిక్షణ తక్కువైనా స్వచ్ఛమైన ప్రేమ మాత్రం ఉంటుంది. వాళ్ళు మెగా ఫామిలీ నుండి ఏ ఒక్కరు కనపడినా మాములు హడావుడి చేయరు. అందుకే వాళ్ళను కలిసేటప్పుడు మెగా ఫామిలీ ముందస్తుగా జాగర్తలు తీసుకుంటారు. ఎవరికైన ఏమైనా అయితే వాళ్ళ ఇంటివరకు వెళ్లి పరామర్శించడం లాంటివి చేస్తారు మెగా ఫామిలీ. సినిమా ప్రపంచంలో అభిమానులు అంతే ఉంటారు దాదాపుగా. బాలయ్య కూడా తన అభిమానులకు ఎప్పుడు బహుమతులు కూడా ఇస్తుంటారు. తాజాగా ఆయనను మరిపించారు పవన్ కళ్యాణ్.

మెగా కుటుంబం బయట కనిపిస్తే వారి అభిమానులను ఆపడం ఎవరి తరం కాదు, ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ లో కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావడం చుసిన అభిమానులు ఆయనను కలవాలని లేదా ఒక్కసారైనా ముట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ వేడుకలో పవన్ ఏ మూడ్ లో ఉన్నాడో తెలుసుకోకుండా ఒక అభిమాని ఆయన వద్దకు రావటానికి ప్రయత్నించాడు, అది సహించలేక పవన్ అసహనానికి గురయ్యాడు. పో అవతలకి.. పో అంటూ ఆ అభిమానిపై చిరాకుపడ్డాడు. దాదాపు గెంటేసినంత పని చేశాడు. అది చూసిన వారు బాలయ్యను గుర్తుచేసుకుని, ఆయనను మరిపించారని విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: