ఈ మ‌ధ్య హీరోలు కొత్త రూట్ ను ఎన్నుకుంటున్నారు. న‌ట‌న‌తోనే కాకుండా పాట‌లు పాడుతూ సింగ‌ర్ అవ‌తారం కూడా ఎత్తుతున్నారు. ఇది ఆదాయం గురించి మాత్రం కాదండి. వారి లో ఉన్న కొత్త టాలెంట్ ను జ‌నాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. మొద‌టి కొంత మంది స్టార్ హీరోలు ప్ర‌య‌త్నిం చారు. అలా త‌మ సినిమాలో పాటలు పాడి సినిమా అభిమానుల మెప్పు ను కూడా పొందారు. వీరి త‌ర్వాత చాలా మంది హీరో లు, హీరోయిన్ లు త‌మ సినిమాల‌లో త‌మ గొంతుతో పాటలు పాడి ఆడియన్స్ ను ఖూషీ చేస్తున్నారు. ఇప్పటికే హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌వితేజ‌, మ‌హేష్ బాబు వంటి స్టార్ హీరోలు త‌మ సినిమాలో పాట‌లు పాడారు.
తాజా గా మ‌రో స్టార్ హీరో కూడా తన ఆదృష్టాన్ని ప‌రీక్షం చ‌డానికి సిద్ధం అవుతున్నాడు. హీరో ద‌గ్గుబాటి రానా తాజా గా కొత్త అవ‌తారం ఎత్త‌నున్నాడు. హీరో రానా హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి జంట‌గా విరాట ప‌ర్వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా న‌క్స‌ల్ బ్యాక్ గ్రౌండ్ లో వ‌స్తుంది. ఈ సినిమాను వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని సురేష్ బాబు, చెరుకూరి సుధాక‌ర్ క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సురేష్ బొబ్బిలి సింగీత ద‌ర్శకునిగా ఉంటున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక విప్ల‌వ గీతం ఉండ‌నుంద‌ట‌. ఈ విప్లవ గీతాన్ని హీరో రానా పాడితే బాగుంటుంద‌ని డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల భావించాడ‌ట‌. ఈ విష‌యాన్ని రానా అడిగార‌ట‌. దీంతో హీరో రానా ఆ పాట పాడ‌టానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం. దీంతో ఈ వారంలో ఈ పాట ను రానా తో పాడించ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నార‌ట‌. అయితే రానా పాడితే ఎలా ఉంటుందో చూడాల‌ని త‌న అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ఇది చూడాలంటే విరాట ప‌ర్వం సినిమా విడుద‌ల అయ్యే వ‌ర‌కు ఆగ‌ల్సిందే. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపు గా పూర్తి అయింద‌ట. త్వ‌రాలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: