సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కొన్ని ఘాటైన మాటలు మాట్లాడారు. ఇక అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన సినిమా టికెట్ల విషయం పై పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మొత్తం మంత్రులను ఒక రేంజ్ లో ఏకిపారేశారు పవన్ కళ్యాణ్.


ఇక ఇదే తంతు లో చిత్ర పరిశ్రమపై అందులోని పెద్దలపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. ఇక మధ్యలో హీరో నాని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. టక్ జగదీష్ సినిమా వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఇలా అందరూ కలిసి నాని ఏ రకంగా ఆడుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇకపై సినిమాలను థియేటర్లలో విడుదల చేయమని అన్నట్టుగా మాట్లాడడంతో ఆ మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

సినిమా థియేటర్లు లేక సినిమాను ఓటిటి లో విడుదల చేస్తే, దానిని అంతగా మాట్లాడారు అన్నట్లుగా తెలియజేశాడు.అంతేకాకుండా మీకు దమ్ముంటే ఏపీ ప్రభుత్వాన్ని థియేటర్ల విషయంలో అడగొచ్చు కదా అని పవన్ కళ్యాణ్ అందరికీ తగిలేలా మాటలు మాట్లాడాడు. ఇక ఈ ప్రసంగంలో టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలు సైతం రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్, మోహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి గురించి తెలియజేశాడు.సినీ ఇండస్ట్రీ లోనే ఉండే వారంతా ఒకే మాట మీద నిలబడాలి కాని.. ప్రాధేయపడితే పనులు అవ్వవు.. అది మన హక్కు గా ప్రశ్నించాలి అంటూ అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు పవన్ కళ్యాణ్. ఈ విషయంపై సినీఇండస్ట్రీలో ఉండే ఏ ఒక్కరూ ఈ విషయంపై స్పందించలేదు. కానీ మొదటిసారిగా హీరో నాని ఈ విషయంపై స్పందిస్తూ ముందుకు వచ్చాడు. ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కు రాజకీయ విభేదాలు ఎలా ఉన్నప్పటికీ.. సిని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాగా తెలియజేసాడు అంటూ చెప్పుకొచ్చాడు నాని. నాని స్పందించడంతో ఈ ట్వీట్ కాస్తా బాగా వైరల్ అవుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి: