ప్రతి ఏడాది సంక్రాంతి కన్నా ముందు క్రిస్మస్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. మన తెలుగులో క్రిస్మస్ పండగకి ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవ్వవు కానీ బాలీవుడ్ లో మాత్రం బడా స్టార్స్ అంత క్రిస్మస్ కి తమ సినిమాలు విడుదల చేసుకోవాలని పోటీ పడతారు. అయితే ఈ ఏడాది ఆ లిస్ట్ లోకి అల్లు అర్జున్ చేరుతున్నాడు. ఆయన నటించిన పుష్ప సినిమా క్రిస్మస్ కి ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ఒక్క తెలుగు భాషలోనే కాదు హిందీ , తమిళ్ , మలయాళం లో కూడా ఒకటేసారి విడుదల కాబోతుంది. అయితే మొన్నటి దాకా ఈ పుష్ప సినిమాని క్రిస్మస్ కి విడుదల చేసి తప్పు చేస్తున్నారు అని చాలామంది అభిప్రాయపడ్డారు.

 దానికి కారణం ఇదే క్రిస్మస్ కి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా విడుదల కాబోతుంది అని. అయితే అమీర్ ఖాన్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. అయితే అల్లు అర్జున్ కి లైన్ క్లియర్ అవుతుంది అనుకుంటే ఇదే సమయానికి రణవీర్ సింగ్ 83 సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా కూడా తెలుగు , తమిళ్ , మలయాళంలో విడుదల కాబోతుంది. కపిల్ సింగ్ బయోపిక్ గా రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ పుష్ప కి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వబోతోంది. లాల్ సింగ్ చద్దా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అదే సమయం చూసుకొని రణవీర్ సింగ్ క్రిస్మస్ కి హిందీ ప్రేక్షకులని అలరించబోతుంది. ఇక ఈ సినిమా లో ఒక ప్రత్యేక పాత్రలో తమిళ నటుడు జీవ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చాలామంది తెలుగు తమిళ నటులు ఉండబోతున్నారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: