బాలీవుడ్ నటి టబు 1995 లో సౌత్ సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి నటించిన తన మొదటి తెలుగు చిత్రం 'కూలీ నం.1' నుంచే స్టార్ గా క్రేజ్ అందుకుంది. అప్పటి నుంచి ఆమె అరుదైన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె ప్రాధాన్యత ఉంటే తల్లి పాత్రలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. గత ఏడాది వచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమాలో సుశాంత్ కు తల్లిగా కన్పించింది. ఇక ప్రయోగాలు చేయాలన్నా కూడా టబు పేరే ముందుగా విన్పిస్తుంది. ఇటీవల 'అంధాదున్' అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటించిన పాత్రపై ప్రశంసల వర్షం కురిసింది. వేరే హీరోయిన్ అయితే ఈ పాత్ర చేయడానికి వెనకడుగు వేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ టబు మాత్రం తన కన్నా తక్కువ వయసున్న వ్యక్తిని ప్రేమించే మహిళగా పేక్షకులను మెప్పించింది. హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం భాషల్లో తనదైన ముద్రను వేసుకుంది టబు.

'నిన్నే పెళ్లాడతా'లో నాగార్జునతో కలిసి ఆమె చేసిన రొమాన్స్ ఎవర్ గ్రీన్ ఇప్పటికీ ఎప్పటికి. ఇక 'ప్రేమ దేశం'లో అప్పటి యువత అందాల రాణి ఆమె. టాలీవుడ్‌లో విజయవంతమైన అరంగేట్రం తర్వాత టబు 1994 లో 'పెహ్లే పెహ్లా ప్యార్ ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలా తన మొదటి ప్రధాన పాత్రతో హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. 1994 లో అజయ్ దేవగన్ తో కలిసి నటించిన 'విజయపథ్' లో ఆమె స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో ఆమె చివరిగా 'జవానీ జనేమాన్'లో సైఫ్ అలీ ఖాన్, అలయ ఎఫ్. తో కలిసి కనిపించింది. తెలుగులో 'అల వైకుంఠపురంలో' చిత్రంలో నటించింది. ఆమె నెక్స్ట్ 'భూల్ భూలైయా' సీక్వెల్‌లో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: