బాలీవుడ్ లో సాధారణంగా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా ఖాన్స్ కు పోటీ పడాలంటే చాలా కష్టం. వాళ్లకు ధీటుగా ఉండే హృతిక్ రోషన్ కంగన రనౌత్‌తో ఈమెయిల్ గొడవ తర్వాత ఆ హీరో సినీ కెరీర్ చాలా నెమ్మదించింది. హృతిక్ రోషన్ కటౌట్‌కి చాలా క్రేజ్ ఉంది. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.  మహిళా ప్రేక్షకులు అయితే.. సూపర్‌ హీరోలా అభిమానిస్తుంటారు. రాబోయే నటులు సైతం హృతిక్‌లా ప్రత్యేకత చాటుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే డ్యాన్సులు.. ఫైట్ లు, మజిల్డ్ బాడీతో  లక్షలమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు హృతిక్. అయితే  కొన్నాళ్లుగా అభిమానులను సంతృప్తి పరచలేకపోతున్నాడు హృతిక్ రోషన్.  

హృతిక్‌ రోషన్‌ 'క్రిష్, ధూమ్2' సినిమాలతో వరుస హిట్ లు అందుకున్నాడు. ఈ బ్లాక్‌బస్టర్స్‌తో టాప్‌ రేస్ లోనూ అడుగుపెట్టాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌కి పోటీగా బాక్సాఫీస్‌ని రూల్‌ చేసేలా కనిపించాడు. అయితే 'క్రిష్3' తర్వాత ఈ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 'క్రిష్' సీరిస్‌లో మొదటి రెండు సినిమాలు హృతిక్ రోషన్‌కి బ్లాక్‌బస్టర్స్‌ తీసుకొస్తే, 'క్రిష్3' మాత్రం తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా చేసిన కంగన రనౌత్‌తో లవ్‌లో ఉన్నాడని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కంగన తనకు అభ్యంతరకరంగా ఈమెయిల్స్‌ పంపించించాడని ఆరోపణలు చేసింది. ఈ వివాదంతో హృతిక్ చాలా డిస్ట్రబ్ అయ్యాడు.

హృతిక్‌ రోషన్‌కి 'క్రిష్3' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'బ్యాంగ్ బ్యాంగ్, మొహంజదారో' రిజల్ట్స్‌తో హృతిక్ గ్రాఫ్‌ డౌన్ అయ్యింది. ఆ తర్వాత వైవిధ్యంగా ఉంటుందని అంధుడిగా 'కాబిల్' సినిమా చేసినా మునుపటి మైలేజ్ రాలేదు. ఇక 'సూపర్ 30'లో హృతిక్‌ కొత్తగా ఉన్నాడనే ప్రశంసలు వచ్చినా నంబర్‌ గేమ్‌లో ముందుకెళ్లలేకపోయాడు. హృతిక్ రోషన్ ఇప్పుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'బ్యాంగ్ బ్యాంగ్, వార్' సినిమాలొచ్చాయి. అయితే ఈ మూవీస్‌ అంచనాలు అందుకోలేకపోయాయి. మరి ఇప్పుడు వస్తోన్న 'ఫైటర్' ఎలాంటి రిజల్ట్‌ తెచ్చుకుంటుంది, ఈ మూవీతో హృతిక్ మళ్లీ టాప్‌-3లోకి వెళ్తాడా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: