జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌డంపై తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై క‌క్ష‌తోనే.. ఇలా ఏపీ ప‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యాని స్తున్నారు. అంతేకాదు.. మంత్రి పేర్ని నానిని స‌న్నాసి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సినిమా టికెట్ల విక్ర‌యం చేయ‌డానికి ఇదేమ‌న్నా.. ప్ర‌భుత్వ జాగీరా? అని ప్ర‌శ్నించారు. ప్రైవేటు పెట్టుబ‌డుల‌పై ప్ర‌భుత్వ పెత్త‌నం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అయితే.. దీనికి ప్ర‌భుత్వం నుంచి కూడా అంతే స్థాయిలో కౌంట‌ర్లు ప‌డ్డాయి. త‌మ‌కు ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రులు చెప్పుకొచ్చారు.

అదేస‌మ‌యంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు.. చిరంజీవి, నాగార్జున వంటివారు త‌మ‌కు చేసిన విజ్ఞ‌ప్తుల మేర‌కు.. దీనిపై దృష్టి పెట్టామ‌ని చెప్పుకొచ్చారు. ఇదే విష‌యాన్ని గ‌తంలో వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజా కూడా  చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అస‌లు ప్ర‌భుత్వం ఇంత‌గా క్లారిటీ ఇస్తుంటే.. ప‌వ‌న్ ముందుగా.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో ఈ విష‌యం అస‌లు చ‌ర్చించారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే..సినిమా టికెట్ల వ్య‌వ‌హారం త‌న‌పార్టీకి సంబంధించిన విష‌యం కాదు.. త‌న వ్య‌క్తిగ‌తం అంత‌క‌న్నా కాదు. మొత్తం ల‌క్ష‌ల మంది ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌వ‌హారం.

సో.. ఇలాంటి విష‌యాల‌ను ప్ర‌స్తావించే సమ‌యంలో ప‌వ‌న్‌.. ఖ‌చ్చితంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో అస‌లు ఏం జ‌రిగిందో.. తెలుసుకుని మాట్లాడి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మంత్రులు ఒక‌రికి మించి కౌంట‌ర్ ఇచ్చారు. అయితే.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా అటు మెగా కుటుంబం కానీ, ఆయ‌న ను అభిమానించే నిర్మాత‌లు కానీ.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా స్పందించ‌లేదు. పైగా మోహ‌న్ బాబు ను ఈ విష‌యంలోకి లాగిన త‌ర్వాత కూడా ఆయ‌న కానీ, ఆయ‌న కుటుంబం కానీ స్పందించ‌లేదు.

సో.. దీనిని గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ ఇండ‌స్ట్రీలో ఒంట‌ర‌య్యారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తంగా ప‌రిశీలిస్తే.. ఈ ప‌రిణామంలో ప‌వ‌న్ ఇబ్బంది ప‌డ‌డం త‌ప్ప‌.. మ‌రో రిజ‌ల్ట్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌యినా.. త‌మ‌కు బాధ ఉంటే.. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించి అయినా .. ఉండాలి. లేదా.. ఆయ‌న చెప్పింది నిజ‌మేన‌ని అనాలి. కానీ, ఏదీ జ‌ర‌గ‌లేదు. దీంతో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను కేవ‌లం రాజ‌కీయ కోణంలోనే ప‌లువురు చూడ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: