టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తెలుగు ప్రముఖ రియాల్టీ గేమ్ షో లలో ఒకటి అయినా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దీనితో పాటు 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా కు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దీనితో పాటే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా ను కూడా పూర్తి చేస్తున్నాడు. అయితే ఇప్పటికే బంగార్రాజు సినిమా పూర్తి చేయడంలో ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన నాగార్జున ఘోస్ట్ సినిమాను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈ సినిమా ను పాన్ ఇండియా లో విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కాకపోతే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చాయి. దాని తో కాజల్ అగర్వాల్సినిమా నుండి తప్పుకున్నట్లు కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి. తెలుస్తున్న వార్తల ప్రకారం కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు షూటింగ్ ఏ మాత్రం ప్రారంభించని సినిమాల నుంచి తప్పుకున్నట్లు మరియు కొంత భాగం షూటింగ్ అయిన సినిమాల ను కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నా ఘోస్ట్ చిత్రబృందం ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తా యో, ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుందా లేదా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: