తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలలో నందమూరి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి  సినిమా విడుదల అయితే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ముఖ్యంగా బాలకృష్ణ సినిమా కానీ  జూనియర్ ఎన్టీఆర్ సినిమా కానీ థియేటర్లలో విడుదల అయింది అంటే వీరు చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే ఈ దసరాకు వీరి సినిమాలు ఏమీ విడుదలకు లేకపోయినా, నందమూరి హీరోల నుంచి అదిరిపోయే అప్డేట్ లు మాత్రం ఫుల్ గా రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే మాస్ మూవీ లో  హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు నుండి అదిరిపోయే అప్డేట్ దసరాకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

దీనితో పాటే బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా ఒక అప్డేట్ దసరాకు రాబోతున్నట్లు తెలుస్తుంది. మరియు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ కూడా దసరాకే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఎప్పటినుండో రెడీగా ఉన్నాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ దసరా కానుకగా చిత్రబృందం తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి తో పాటే కళ్యాణ్ రామ్ కూడా అనేక చిత్రాలలో నటిస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అప్పట్లో బింబిసర అనే ఒక టైటిల్ తో హల్చల్ చేసిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ దసరాకు విడుదల చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: