టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నాడు అనడంలో ఏమాత్రం వెనక ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నారప్ప సినిమాను కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన వెంకటేష్ ఆ విషయంలో తన అభిమానులు కూడా చాలా వరకు నిరాశపరిచాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలి అని అని అభిమానులలో  కొంతమంది అప్పట్లో తెలియజేశారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సినిమాను థియేటర్లలో విడుదల చేయడం కుదరదు, అంటూ ఓటిటి లోనే విడుదల చేశారు. దీంతో పాటే వెంకటేష్ ఎఫ్ టు సినిమా కు సీక్వెల్గా  తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య కొంత కాలం విరామం తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్  ను ప్రారంభించారు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ దృశ్యం టు సినిమాలో కూడా హీరోగా నటించాడు. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న దృశ్యం టు సినిమా ను కూడా ఓటిటి లో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత నారప్ప సినిమాను ఓటిటి లో విడుదల చేయడం ద్వారా వెంకటేష్ అభిమానులు నిరాశ పడ్డారు అనే ఉద్దేశంతో దృశ్యం టు సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం అంటూ వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఈ సినిమా మాతృక అయిన మలయాళం దృశ్యం టు ను నేరుగా ఓటిటి లోనే విడుదల అయింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన తెలుగు దృశ్యం టు ను కూడా నేరుగా  ఓటిటి లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తారా , లేకపోతే  ఓటిటి లో విడుదల చేస్తారా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: