టాలీవుడ్. సౌత్ లో నంబర్ వన్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ని సైతం ఢీ అంటే ఢీ అంటూ ఢీ కొడుతున్న అతి పెద్ద సినీ పరిశ్రమ. టాలీవుడ్ లో ఒక బాహుబలి మూవీ వచ్చిన తరువాత రేంజి ఎక్కడితో వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ ఏర్పడ్డాక కూడా  మూడున్నర దశాబ్దాల పాటు పాలన సాగినా మద్రాస్ లోనే చిత్ర పరిశ్రమ ఉండిపోయింది.


ఎందరో పెద్దల ప్రయత్నాలు ఫలించి హైదరాబాద్ కి 1990 దశకంలో  టాలీవుడ్ షిఫ్ట్ అయింది. అక్కడ అలా కుదురుకుంది అనుకున్న తరుణంలో విభజన జరిగింది. ఏపీ, తెలంగాణా అని రెండుగా పరిశ్రమ విడిపోయింది. ఇక తెలంగాణాలోనే టాలీవుడ్ విస్తరించింది. అక్కడే స్టూడియోలు ఉన్నాయి. అక్కడే సినిమా వాళ్ల నివాసాలు ఉన్నాయి. ఏపీ విడిపోయి ఏడేళ్ళు గడచినా కూడా టాలీవుడ్ హైదరాబాద్ కే పరిమితం అయింది. ఏపీకి తొలి సీఎం గా ఎన్నికైన చంద్రబాబుకు టాలీవుడ్ తో పరిచయాలు ఎక్కువ. ఒక సామాజిక వర్గం టీడీపీకి సింపతీ చూపిస్తూ ఉంటుంది.


అలాంటి టాలీవుడ్ నాడు కూడా ఏపీలో విస్తరించే ప్రయత్నం చేయలేదు. ఇక వైసీపీకి టాలీవుడ్ లో ఉన్న బంధాలు తక్కువ. జగన్ సీఎం అయినా కూడా ఎవరూ ఆయన్ని అభినందించకపోవడం చూస్తే ఈ దూరం అలాగే ఉంది అంటారు. ఇక టాలీవుడ్ తెలంగాణాలోనే ఉండడం వల్ల ఆదాయం అంతా అక్కడి ప్రభుత్వానికే పోతోంది. ఏపీలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. తెలంగాణాతో పోలిస్తే రెవిన్యూ కూడా సినిమాలకు ఇక్కడే బాగా వస్తుంది. కానీ  కేవలం టికెట్ అమ్మకాల వచ్చే పన్నుల ఆదాయం తప్ప ఏపీకి వేరేగా టాలీవుడ్ నుంచి రాదు, మరో వైపు చూస్తే ఏపీలో కూడా టాలీవుడ్ ని విస్తరించాలని అంతా కోరుతున్నా వారు మాత్రం అక్కడే ఉంటున్నారు.


ఈ నేపధ్యంలో టాలీవుడ్ విషయంలో చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గట్టిగానే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటోంది.  దీని వల్ల ప్రభుత్వానికి పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. అదే టైమ్ లో అసలైన నష్టం మాత్రం టాలీవుడ్ కే అన్నది కూడా ఒక విశ్లేషణ. మరో వైపు చూస్తే ప్రభుత్వం తీసుకువస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ వల్ల జనాలకు లాభం కలుగుతుంది. సో వారి వైపు నుంచి చూస్తే ఏ రకమైన  వ్యతిరేకత రాదు. ఇక టాలీవుడ్ పరిశ్రమ వల్ల లాభం పొందుతున్నది అచ్చంగా అక్కడి ప్రభుత్వమే. దాంతో ఇపుడు అవసరం అయితే టాలీవుడ్ వైపు నుంచే ఉంది అన్నది ఒక విశ్లేషణ. అందుకే ఇన్నాళ్ళూ ఏపీ ని పట్టించుకోని టాలీవుడ్ పెద్దలు ఇపుడు ఆలోచించుకోవాల్సి వస్తోంది అంటున్నారు. చూడాలి ఈ పరిణామాలు  ఎటు వైపునకు దారి తీస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: