బాలయ్య. సీనియర్ హీరో. ఆయన నాలుగున్నర  దశాబ్దాల పాటు టాలీవుడ్ లో హీరోగా చలామణీ అవుతున్నారు. ఎన్నో సక్సెస్ లను చవిచూశారు. వందకు పైగా సినిమాలను చేసిన బాలయ్య ఇంకా నటిస్తూనే ఉన్నారు.


అయితే బాలయ్య కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి పడితే ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడం మాత్రం ఎపుడూ జరగలేదు. ఉదాహరణకు 1999లో సమర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ పడితే ఆ తరువాత కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. ఇక 2001 లో నర సింహనాయుడు మూవీ వస్తే 2004లో లక్ష్మీ నరసింహ వచ్చే దాకా బ్లాక్ బస్టర్ లేదు. 2009లో సింహా చేసిన బాలయ్య 2014లో లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


ఇక 2017లో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో హిట్ కొట్టిన బాలయ్యకు మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. అయితే ఇపుడు మాత్రం బాలయ్య లైనప్ చూస్తే వరస హిట్లు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండ రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఈ మూవీ మీద ఉన్న అంచనాలు చూసుకుంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. మరో వైపు దీని తరువాత గోపీ చంద్ మలినేని మూవీ బాలయ్యతో ఉంది. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీ బాలయ్యతో కూడా పవర్ ఫుల్ మూవీయే సెట్ చేశాడు. ఇక ఫ్లాప్ అన్నది ఎరగని అనిల్ రావిపూడి బాలయ్యతో చేస్తున్నారు. ఆ మూవీ కూడా మంచి స్టోరీతో రానుంది. దాంతో అది కూడా హిట్ అవడం ఖాయమని అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే బాలయ్య వరసపెట్టి హిట్లతో  హ్యాట్రిక్ విక్టరీని సొంతం చేసుకుంటారా అన్నదే ఫ్యాన్స్ అంచనాగా ఉందిట. అదే జరిగితీఅ బాలయ్యకు తిరుగులేదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: