నటులు ఒక ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోలుగా  మంచి గుర్తింపు ఉన్న వారు కూడా కొంత కాలం తర్వాత ఇతర భాషలో మంచి ప్రాముఖ్యం ఉన్న పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ ఉంటారు.  తెలుగులో మంచి స్టార్ డమ్ ను చూసి కోలీవుడ్ లో విలన్లుగా నటించిన వారి గురించి మనం తెలుసుకుందాం.  కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవికోలీవుడ్ చిత్రంలో విలన్ గా నటించినవారే. 1981 లో తెరకెక్కిన `రణువ వీరన్` అనే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజినీకాంత్ పోటా పోటీగా నటించి జనాలను మెప్పించారు. ఇక మన టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా మారాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన జగపతిబాబు ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగని జగపతి బాబు కోలీవుడ్ సినిమాల్లో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించి అక్కడి ప్రజలను కూడా మెప్పించాడు. లింగ, భైరవ, విశ్వాసం వంటి చిత్రాలతో కోలీవుడ్ ప్రజలకు జగపతిబాబు విలన్ గా కనిపించి మెప్పించాడు.  అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర కూడా కోలివుడ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ధనుష్ హీరోగా నటించిన `పటాస్` చిత్రంలో నవీన్ విలన్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాగే గోపీచంద్ కూడా తమిళ జయం లో విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: