సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని రోజులుగా సమంత మరియు నాగ చైతన్య గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే.

అయినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా వాళ్లిద్దరూ ఏ రోజు కూడా మీడియా ముందు స్పందించలేదని తెలుస్తుంది.సోషల్ మీడియాలో కనీసం దానిపై ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం. ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారని తెలుస్తుంది.. నాగ చైతన్య తన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడని సమాచారం. మరోవైపు సమంత చెన్నైకి వెళ్లి అక్కడ సినిమా చేసుకుంటుందని తెలుస్తుంది.అక్కినేని కుటుంబంలో జరుగుతున్న వేడుకలకు గాని.. పార్టీలకు గాని సమంత హాజరు కావడం లేదన్న విషయం అందరికి తెలిసిందే.

దీన్ని బట్టి ఏదో జరుగుతుంది అని అనుమానం మాత్రం అక్కినేని అభిమానుల్లో బలంగా ఉందని తెలుస్తుంది.లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో కూడా సమంత గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని మీడియాకు  నాగ చైతన్య కండిషన్ పెట్టాడని అందరికి తెలుసు.కొంతమంది దీని గురించి అడిగినా కూడా దాటవేసే సమాధానం చెప్పాడని సమాచారం.కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదని తెలుస్తుంది. తమ గురించి ఎవరు ఏది రాసుకున్న పట్టించుకునే సమయం మరియు అవసరం తనకు లేదని చాలా పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడట నాగ చైతన్య. మరోవైపు సమంత కూడా ఈ విషయం గురించి ఎక్కడ కూడా మాట్లాడటానికి సమంత ఇష్టపడటం లేదట. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ జంటపై మరో వార్త కూడా వైరల్ అవుతుందని సమాచారం.

త్వరలోనే తమ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం అభిమానుల ముందు ఉంచబోతున్నారని సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని వార్త వినిపిస్తుంది. అది ఎలాంటి నిర్ణయం అయి ఉంటుంది అని అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారని సమాచారం. కలిసి జీవించడానికి కాంప్రమైజ్ అయ్యారా.. లేదంటే నిజంగానే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదని తెలుస్తుంది. అక్టోబర్ 6న చైతు సమంత 4వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగనుందని తెలుస్తుంది. ఆ రెండు మూడు రోజుల్లోనే తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే అభిమానులు కూడా అక్టోబర్ 6 కోసంఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: