అలనాటి సీనియర్ హీరోయిన్ రాధికగురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె తన అందచెందాలతో నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ భాషల్లో చెరగని ముద్ర వేసుకుంది. వెండితెరపైన, స్మాల్ స్క్రీన్ మీద, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రాణించిన అరుదైన నటి రాధిక శరత్ కుమార్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక కొలీవూడ్ ఇండస్ట్రీలో దశాబ్ద కాలంపాటు తమిళ టాప్ హీరోయిన్ స్థానం ఆమెకే దక్కింది.

సిల్వర్ స్రీన్ పై రాధిక అన్ని రకాల పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేయగల అద్భుత నటీమణుల్లో ఆమె ఒకరు అనే చెప్పాలి. రాధిక తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌ మీద తనదైన ముద్ర చేసింది. రాధిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించినా, పచ్చిమాస్‌గా కనిపించినా.. మోడ్రన్ డ్రెస్ వేసినా.. సంప్రదాయంగా చీరకట్టులో కనిపించినా.. గృహిణిగా ఆకట్టుకున్నా.. అమయాకపు రోల్స్ చేసినా.. గయ్యాళీ పాత్రలు చేసినా..  అన్నింటిలోనూ తన మార్క్ వేసింది.

అయితే రాధిక తమిళంలో ఫేమస్ కమెడియన్ ఎం.ఆర్.రాధా కూతురు. ఇక ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదంట. కానీ.. ఆ తరువాత కాలంలో తండ్రి వారసత్వంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ప్రత్యేకత చాటుకుంది. రాధిక తమిళ మూవీతో ఎంట్రీ ఇచ్చినా.. తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా రాణిస్తూ ఓ ట్రెండ్ మార్క్ ని సెట్ చేసుకుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తరువాత ఎన్నో సినిమాలో హీరోలకు వదినగా, అమ్మగా, అక్కగా, అత్తగా ఎన్నో సినిమాలో అలరించారు. సెకండ్ ఇన్నింగ్ లో కూడా అమ్మ క్యారెక్టర్ లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: