వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వరుసగా మద్దతు పెరుగుతోందని తెలుస్తుంది. పవన్ కామెంట్స్ ని వైసిపి నేతలు విమర్శలతో తిప్పికొడుతున్నారన్న విషయం అందరికి తెలిసిందే.

కానీ చిత్ర పరిశ్రమ నుంచి నెమ్మదిగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ అందుతోందని తెలుస్తుంది.ఇప్పటికే నేచురల్ స్టార్ నాని మరియు బర్నింగ్ స్టార్ గా పేరు పొందిన సంపూర్ణేష్ బాబు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్స్ చేశారని తెలుస్తుంది.

తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని పూర్తిగా సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో అద్భుతమైన సంపాదించుకున్న కార్తికేయ. కార్తికేయ ప్రస్తుతం హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే.

కార్తికేయ పవన్ కి మద్దతుగా చేసిన ట్వీట్ మనం పరిశీలిస్తే నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు అలాగే వ్యతిరేకిని కూడా కాదు అని చెప్పారట. కానీ చిత్ర పరిశ్రమ సమస్యల గురించి పవన్ కళ్యాణ్ సర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థవంతమైనవని కొనియాడినట్లు తెలుస్తుంది. ఆయన సినీ పరిశ్రమ తరుపున మాట్లాడారు. మనందరి తరుపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత' అని కార్తికేయ ట్వీట్ చేశారని సమాచారం.

నిర్మాతల కష్టార్జితం మరియు నటీనటుల కష్టంతో తెరకెక్కే చిత్ర పరిశ్రమని ఏపీ ప్రభుత్వం కంట్రోల్ చేయడం ఏంటి అంటూ పవన్ ధ్వజమెత్తిన విషయం అందరికి తెలిసిందే. పవన్ ఆన్లైన్ టికెట్స్ విధానాన్ని తప్పు బట్టారని సమాచారం. ఈ సందర్భంగా పవన్ వైసిపి ప్రభుత్వంపై చేసిన సంచలన విమర్శలు అందరికి ఎక్కడో గుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతానికి హీరో కార్తీకేయ స్పందించాడు. తరువాత ఎంత మంది స్టార్ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: