అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం గత కొంతకాలంగా విడుదల తేది కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే  రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించి..మళ్ళీ క్యాన్సిల్ చేశారు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాలని అఖిల్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.మరోవైపు అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ప్లాపుల్లో నుంచి బయటపడాలని చూస్తున్నాడు.ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావాల్సింది.కానీ అది కుదరలేదు. ఆ తర్వాత సమ్మర్ లో విడుదల చేయాలని ప్రయత్నించినా..

 ఒకవైపు కరోనా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు భారీగా తగ్గడంతో సినిమాను వాయిదా వేశారు.అయితే ఇప్పుడు తాజాగా దసరా బరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అక్టోబర్ 8 న ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసారు చిత్ర యూనిట్. కానీ మరోసారి వాయిదా పడింది. ఇక ఆ డేట్ కి కాకుండా మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.అక్టోబర్ 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు అభిమానులు.ఇక ఈ సినిమా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్  కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ తో వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమా అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.ఈ సినిమాలో అఖిల్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ రాగా. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: