టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం  చేశాడు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించి తన అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. ఇలా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని కసి తో ఉన్న ఈ అక్కినేని హీరో, ఈ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా లో హీరో గా కూడా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఇప్ప టికే కొన్ని పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేయగా, వీటికి మంచి క్రేజ్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు తారాస్థాయి కి తీసుకెళ్లాల చేశాయి.

 అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఒక స్పై థ్రిల్లర్ అని వార్తలు వస్తున్నాయి. వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన హానీ ట్రాప్ నేపథ్యం అని మరో వైపు జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు లో జరిగింది. ఇక ఇటీవలే మరో షెడ్యూల్ వైజాగ్ పోర్టులో చిత్ర బృందం ప్లాన్ చేశారు. తాజాగా ఏజెంట్ యూనిట్ సభ్యులు విదేశాలకు పయనమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి వచ్చాక తిరిగి బ్యాలెన్స్ షూటింగ్ హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఏజెంట్ చిత్రబృందం చక చక సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏజెంట్ సినిమాతో అక్కినేని అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: