మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ వ్యాఖ్యలపై తీవ్ర మైన చర్చ జరుగుతోంది.తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోందంటూ పవన్చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతోంది.ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు,వైకాపా నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

చిత్ర పరిశ్రమ మనుగడ అనేది కొనసాగాలంటే  రెండు ప్రభుత్వాల మద్దతు అవసరం అని చెప్పుకొచ్చింది.వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.'కరోనా కారణంగా సినీ పరిశ్రమ సమస్యల్లో చిక్కుకుంది.ఇలాంటి సమయంలో రెండు ప్రభుత్వాల మద్దతు అవసరం.వాటి మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టం.సినీ ఇండస్ట్రీపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.వ్యక్తిగత అభిప్రాయాలను పలు వేదికలపై చెబుతున్నారు.వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు.సినీ పరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి.కరోనా తో సహా వివిధ అంశాలపై తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది.

చిత్ర పరిశ్రమ  ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్ని నాని తో చర్చించాం.ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించారు.సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఏపీ సీఎం హామీ ఇచ్చారు.మార్చి 2020 నుంచి సినిమా ఇండస్ట్రీలోని కళాకారులు,కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నాయకుల మద్దతు కావాలి.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు ఇలాగే కొనసాగాలి" అని తాజా ప్రకటనలో తెలిపింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: