టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ద్వారా చిత్ర పరిశ్రమకి నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుండి పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ హీరోగా తనకు వచ్చిన సినిమాలతో మంచి సక్సెస్ లు కొట్టి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఉండగా, ఇటీవల కొన్నేళ్ల క్రితం జనసేన పేరుతో రాజకీయ పార్టీ ని నెలకొల్పి ప్రజాసేవ చేసేందుకు ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక మూడేళ్ళ క్రితం అజ్ఞాతవాసి తో సినిమాలకు కొంత విరామం పలికిన పవన్, కొన్నాళ్ల క్రితం వకీల్ సాబ్ ద్వారా మళ్ళి ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు.

అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు గల మనిషి. మెగాస్టార్ కొంత సున్నిత స్వభావం గల వ్యక్తి అయితే పవన్ మాత్రం ఒకింత గట్టిగా మాట్లాడే వ్యక్తి అని ఆయన సన్నిహితలు కూడా అంటుంటారు. ఇక విషయం ఏమిటంటే, నిన్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తదైనా శైలిలో సినిమా పరిశ్రమని ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శలు ఎక్కుపెట్టారు.

కావాలంటే తన సినిమాలు ఆపుకోవాలి తప్ప మూవీ పరిశ్రమని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టవద్దని ఆయన సభాముఖ్యంగా వైసిపి ప్రభుత్వాన్ని కోరారు. అయితే పవన్ చేసిన ఆ వ్యాఖ్యలను పలువురు మెగాఫ్యాన్స్, ప్రేక్షకులు సమర్థిస్తుండగా మరికొందరు ప్రేక్షకులు, అలానే ప్రజలు మాత్రం పూర్తిగా తప్పుబడుతున్నారు. పవన్ కావాలనే సినిమా ఫంక్షన్ లో రాజీకీయాలు మాట్లాడి వైసిపి పార్టీ నేతలపై నిందలు వేశారనేది కొందరి వాదన. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్స్, టికెట్ రేట్స్ వంటి ప్రధాన సమస్యలపై ఏపీ ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టి త్వరలో తగు న్యాయం చేస్తే ఎందరో సినిమా కార్మికులకు మంచి జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: