లేటెస్ట్ గా సాయి పల్లవి, నాగ చైతన్య జోడీగా తెరకెక్కిన హృద్యమైన ఎమోషనల్ సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాకి పవన్ సంగీతం అందించగా నారాయణ్ దశ నారంగ్, అలానే శేఖర్ కమ్ముల కలిసి ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇద్దరు మధ్యతరగతికి చెందిన యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టడం, ఆ తరువాత అది ఏ పరిస్థితులకి దారి తీసింది, చివరికి వారిద్దరూ కలిసారా, వివాహం చేసుకున్నారా లేదా అనే కథాంశంతో కొన్నేళ్ల నుండి సమాజంలో ప్రధానమైన రెండు సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని శేఖర్ కమ్ముల తీసిన ఈమూవీ రెండు రోజుల క్రితం రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో పాటు ఇతర పాత్రల్లో నటించిన రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, దేవయాని, ఉత్తేజ్ వంటివారు తమ తం పాత్రల్లో ఒదిగిపోయి యాక్ట్ చేసారని, అలానే పవన్ అందించిన సంగీతంతో పాటు సాయి పల్లవి, నాగ చైతన్య ల డ్యాన్స్ కూడా ఎంతో బాగుందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై నేడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడ్తలు కురిపించారు. మరొకసారి శేఖర్ కమ్ముల గారు సూపర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి మళ్ళి హిట్ కొట్టారని, అలానే హీరో చైతు, హీరోయిన్ సాయి పల్లవి ఇద్దరూ కూడా ఎంతో సహజంగా నటించారని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేసిన మహేష్, సాయి పల్లవి డ్యాన్స్ అయితే అద్భుతంగా ఉందని, అసలు ఆమెకి ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా అంటూ మహేష్ పెట్టిన పోస్ట్ పై సాయి పల్లవి స్పందిస్తూ, సర్ మీరు పెట్టిన పోస్ట్ ని ఇప్పటికే ఎన్నో మిలియన్ల సార్లు చదివి మీ అభిమానిగా లోలోపల ఎంత ఆనందపడ్డానో నిజంగా చెప్పలేను. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సర్ అంటూ ఆమె పెట్టిన రీట్వీట్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: