తెలుగు చిత్ర సీమతో పాటు బాలీవుడ్ లోనూ పవర్ ఫుల్ విలన్ గా నిరూపించుకున్నాడు రాహుల్ దేవ్. 2000 లలో విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ దేవ్ ఇప్పటికీ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. పరిశ్రమలో రెండు దశాబ్దాలు వరుసగా సినిమాల్లో నటించిన ఆయన మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అజ్ఞాత ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఆయన ఇటీవల నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పరిశ్రమలో మార్పు వచ్చినప్పుడే తాను సినిమాలను వదిలేస్తాను అని అన్నారు. అదే సమయంలో తన భార్య అయిన మరణించడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నట్టు ఈ విలన్ తెలిపారు. ఆయన భార్య మరణించినప్పుడు దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర సంవత్సరాల విరామం తీసుకున్నారు రాహుల్ దేవ్.

ఆయన భార్య రీనా క్యాన్సర్ కారణంగా మరణించారు. ప్రస్తుతం తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీ చాలా మారిపోయింది అని అన్నారు. ప్రస్తుతం సినిమాల కథలు రాసే విధానం సృజనాత్మకత బాగా పెరిగాయని చెప్పారు. క్యాస్టింగ్ డైరెక్టర్ సైతం మరింత ప్రొఫెషనల్ గా మారారని అన్నారు. ఆయన కొడుకు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు.


ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు 8 సినిమాల్లో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రీఎంట్రీ తరువాత రాహుల్ దేవ్ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఆయనకు అవకాశాలు రాలేదో, వచ్చినా తన పాత్రలు నచ్చలేదో తెలీదు కానీ తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సీనియర్ నటుడిని మరోసారి వెండి తెరపై చూడాలి అని ఆశ పడుతున్నారు. మరి రాహుల్ దేవ్ బాలీవుడ్ లోనే నటిస్తాడా ? లేదంటే టాలీవుడ్ తెరపైనో కనిపిస్తాడా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: