నిజానికి బయటకు కనిపించేది ఏది నిజం కాదు.. అని అన్నట్టుగానే, వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులకు నవ్వు తెప్పించే హాస్య నటీనటుల తెరవెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పడం చాలా కష్టం.. ఇక ప్రముఖ లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన శ్రీ లక్ష్మి, సినీ ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను అందర్నీ ఎంతగా అలరిస్తుందో, ఆమె తెర వెనుక కష్టాలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. శ్రీ లక్ష్మీ తండ్రి అమర్నాథ్.. అప్పట్లోనే ఒక పెద్ద హీరో. అయితే ఈ విషయం చాలామందికి తెలియక పోయినప్పటికీ, ఆయన నటించిన అపర సందేశం సినిమా అప్పట్లోనే మంచి ఘన విజయాన్ని అందుకుంది.

ఇంకా ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ఆయన, ఆ తర్వాత కమెడియన్ గా కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం జరిగింది. శ్రీలక్ష్మి ఏ రోజు కూడా నటి అవ్వాలని అనుకోలేదు..కానీ కొన్ని అనుకోని కారణాల చేత ఆమె నటి కావాల్సి వచ్చింది. ఇందుకు కారణం తన తండ్రికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక పోవడమే.. హీరో గా, కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అమర్నాథ్.. స్నేహితుల మాటలు విని ఉన్న డబ్బంతా పెట్టి నిర్మాతగా మారి.. మగవారి మాయలు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది.. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆయన అప్పుల పాలయ్యారు. ఆ తరువాత సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఉన్న ఆస్తి అంతా అమ్ముకోవాల్సి వచ్చింది.


ఇక శ్రీ లక్ష్మీ వాళ్ళ కుటుంబం.. పెద్ద కుటుంబం కావడంతో కుటుంబ భారాన్ని మోయలేక పోయాడు అమర్నాథ్. దీంతో పెళ్లీడుకొచ్చిన శ్రీలక్ష్మి ఇంటి బాధ్యతను తన భుజాన వేసుకుని నటిగా అవతారమెత్తింది. మొదట చిన్న చిన్న వేషాలలో నటించిన ఈమె ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతో శ్రీ లక్ష్మి  వెనుతిరిగి చూసుకోలేదు. అయితే ఈమె డబ్బులు మాత్రం వెనక్కి వేసుకోలేకపోయింది. నిర్మాతలు చెల్లని చెక్కులు ఇవ్వడం,  అడిగిన దాంట్లో సగం మాత్రమే డబ్బులు ఇవ్వడం ఇలా ఎన్నో కష్టాలు, నష్టాలను ఎదుర్కొంది శ్రీలక్ష్మి.


మరింత సమాచారం తెలుసుకోండి: