తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో మంది హాస్యనటులను వృద్ధిలోకి తెచ్చింది. చిన్నా చితకా ఆర్టిస్టులు అనే తేడా లేకుండా టాలెంట్ ఉన్న వారినందరినీ కూడా ఎంతగానో ఆదరించింది. ప్రేక్షకులు కూడా వారి కామెడీ పంచులకు ఫిదా అయిపోయి వారిని స్టార్ కమెడియన్ లాగా చేసేసారు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో లంక భద్రాద్రి శ్రీ రామచంద్ర మూర్తి అనే నటుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఇంకా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఇంత పొడుగు పేరు ఉన్న ఆయన ఎవరు అనేది మీరు గుర్తు పట్టకపోవచ్చు.

ఎల్బీ శ్రీరామ్ అంటే ఆయన అందరికీ సుపరిచితులే. నటుడిగా కంటే ముందు రచయితగా దర్శకుడిగా ఆయన పని చేసి మంచి పేరు సంపాదించుకుని ఆ తర్వాత నటుడిగా హాస్యనటుడిగా ఎదిగారు. రంగస్థలంపై గొప్ప పేరు తెచ్చుకుని ఆ తర్వాత రేడియోలో పని చేసి ఆపై సినిమా పరిశ్రమ లోకి ప్రవేశించాడు ఎల్.బి.శ్రీరామ్. రచయితగా నటుడిగా దర్శకుడిగా పలు పాత్రలు పోషించిన ఎల్.బి.శ్రీరామ్ ఇప్పటివరకు నాలుగు వందల సినిమాలకు పైగా నటించాడు. నాలుగు నంది పురస్కారాలను అందుకున్నాడు.

 ప్రస్తుతం సినిమాలతో పాటు కొన్ని లఘు చిత్రాలు కూడా రూపొందిస్తు ఇంకా ఆయన కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. కిష్కింద కాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన ఎల్.బి.శ్రీరామ్ అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు కూడా వేసేవారు. ఆ విధంగానే హలో బ్రదర్ ఆయన హిట్లర్ సినిమాలకు మాటలు రాసి మంచి ఇమేజ్ ను తెచ్చుకున్నారు. అలాగే ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో ఆయన పోషించిన పల్లెటూరి వాడి పాత్ర కు ప్రేక్షకులను అలరించడం తో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుని స్టార్ అయ్యాడు.హాస్య పాత్రలలో తనదైన ముద్ర వేసుకున్న ఎల్బీ శ్రీరామ్ సెంటిమెంట్ మిళితమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: