తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యనటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అలీ. 1100 కు పైగా సినిమాల్లో నటించిన ఆలీ బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగ ప్రవేశం చేసి ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించుకొని అందరినీ ఆకట్టుకున్న ఆలీ డాక్టరేట్ ను కూడా దక్కించుకోవడం విశేషం. తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు కయ్యుం కూడా నటుడు కావడం విశేషం. కమెడీయన్ గా నే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలలో చేసి ప్రేక్షకులను అలరించాడు.

రాజమండ్రిలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ చిత్ర బృందానికి వినోదం పంచడానికి వచ్చిన ఆలీని చూసి దర్శకుడు కె.విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని మంచి సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. రాజమండ్రి నుంచి చెన్నైకి వచ్చేశాడు. ఆయన నటించిన సినిమాలను చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న ఓ సినిమా కోసం చెన్నైకి పిలిపించగా అక్కడ ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా రూపొందిస్తున్న సీతాకోకచిలక చిత్రం కోసం ఓ బాల నటుడి కోసం చూస్తున్నాడు అని తెలిసి ఆడిషన్ కి వెళ్ళాడు.

అక్కడ తన ప్రతిభ చాటుకున్న ఆలీకి ఆ సినిమాలో అవకాశం కల్పించగా ఆ చిత్రం ఆయనకు ఎనలేని పేరు తీసుకువచ్చింది. అలాగే ప్రేమ ఖైదీ సినిమా లో బ్రహ్మానందం కోట శ్రీనివాసరావులతో ఆలీ కూడా నటించగా వారి రేంజ్ లోనే హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఆలీ చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. యమలీల సినిమా ద్వారా కథానాయకుడిగా కూడా స్థిరపడ్డాడు. ఇప్పటికే హీరో పాత్రలను పోషిస్తూ ఉంటాడు కానీ ఆయన మొదటి ప్రాధాన్యం మాత్రం కమెడియన్ గానే అని చెబుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన ఈటీవీలో ఆయన ఓ షోకి వ్యాఖ్యాతగా కూడా చేస్తున్నాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కి ఫిలిం ఫేర్ అవార్డు రాగా సూపర్ సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు ఆలీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: