నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల పరంగా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న బాలకృష్ణసినిమా పూర్తి కాగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా పెట్టారు. ఈ సినిమా తర్వాత తెలుగు లో మంచి కామెడీ డైరెక్టర్ గా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా నటించడానికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమాలు స్టార్ట్ కావాలంటే బాలకృష్ణ ముందుగా అఖండ మూవీ ని పూర్తి చేయాలి . కొన్ని రోజుల క్రితం వరకు అఖండ సినిమాను చక చకా పూర్తి చేసి దసరా కానుకగా చిత్ర బృందం విడుదల చేయబోతుంది అంటూ అనేక వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం చూస్తే ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. సినిమాను ఇప్పట్లో దసరాకు విడుదల చేసే అవకాశాలు కనపడటం లేదు. దీనితో ఈ సినిమాను దీపావళికి లేదా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళికి పెద్దగా ఎలాంటి పోటీ లేకపోయినా , సంక్రాంతికి మాత్రం ఫుల్ గా పోటీ ఉంది అని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ , రానా లు హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్నాయి మరి బాలకృష్ణ ఈ హీరోలతో పోటాపోటీగా తన సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తాడా , లేక ఎక్కువగా పోటీ లేని దీపావళికి అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: