టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో  తెరకెక్కుతున్న సినిమా లైగర్.  ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి బిగ్ కం బ్యాక్ చేసిన పూరీ జగన్నాథ్ మరొకసారి విజయ్ దేవరకొండ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దీనికి సంబందించిన ఫోటో కూడా విడుదల అయ్యాయి.

ఈ సుదీర్ఘ షెడ్యూల్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పోస్టర్ విడుదల కాగా సోషల్ మీడియాలో అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెట్ నీ బాలకృష్ణ కూడా చూసి ఎంతో ముచ్చట పడ్డారట. గ్రాండ్ గా ఉన్న ఈ సెట్ చూసి విజయ్ దేవరకొండ ను ప్రశంసించారట.

ఇకపోతే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ తెలియజేయ పోతున్నామని తెలిపింది చిత్ర బృందం. మరి ఆ అప్డేట్ విజయ్ దేవరకొండ అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కన్నెక్ట్స్ కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్ ఛార్మి, అపూర్వ మెహతా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోత్ ఈ రోజు లైగర్ టీం రిలీజ్ చేసే అప్డేట్ ఏంటో అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. గ్లిమ్ప్స్ అని కొందరు అంటుంటే కాదు రిలీజ్ డేట్ ఇంకొందరు అంటున్నారు.. మరి ఇందులో ఏ ఉప్డతో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: