సాయి ధరమ్ తేజ్ హీరోగా తెలుగు క్రేజీ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్ . ఈ సినిమా పై మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్  లో చూపించిన అంశాలు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అవినీతి ని ఎదుర్కొనే పవర్ఫుల్ కలెక్టర్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో కొత్త సాయి ధరమ్ తేజ్ ను చూసే అవకాశం ఉంది అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తి తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా తెలుగు ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ మధ్య ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, మరి కొంత మంది సినీ ప్రముఖులు కూడా ఈ ఫంక్షన్ కు విచ్చేశారు. అయితే ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. దర్శకుడు దేవాకట్టా ది ఒక ప్రత్యేకమైన స్కూల్. ఈ మూవీ షూటింగ్ కు మేము ఒక స్కూల్ కి వెళ్లినట్టు వెళ్ళాము. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఆయన నన్ను అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు . తెలుగు ప్రేక్షకుల్లా ఎవరు ఉండరు. ఈ మూవీని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. మీ అందరి మాదిరిగానే ఈ సినిమా కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా ఈ సినిమాను థియేటర్ లో విజిల్స్ వేస్తూ చూడాలని ఉంది అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: