టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రష్మిక మందన హడావుడి కాస్త తగ్గినట్టు గా కనబడుతోంది. రష్మిక మందన పెద్దగా మీడియా ముందు కూడా కనపడటం లేదు. సోషల్ మీడియాలో కూడా రష్మిక మందన హడావుడి లేకపోవడంతో ఆమె ఎందుకు సైలెంట్ అవుతున్నారు ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే రష్మిక మందన ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఆమె కొంత కాలం సినిమాలకు విరామం తీసుకొని అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.

అయితే తెలుగులో రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించిన నేపథ్యంలో ఆమె పెద్దగా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తమిళంలో ఆమెకు మంచి ఆఫర్ లో ఉన్నా సరే తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు అని చెప్పి రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే తెలుగు హీరోల సినిమాల్లో ముందు 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చెప్పి ఇప్పుడు కేవలం మూడు నుంచి నాలుగు కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని రష్మిక మందన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

అందుకే ఆమె ఇప్పుడు తెలుగులో ఆసక్తి చూపించడం లేదని పెద్ద హీరోల సినిమాల విషయంలో కూడా రెమ్యునరేషన్ని భారీగా తగ్గించడం కరెక్ట్ కాదని ఆమె కొంతమంది దర్శక నిర్మాతల వద్ద వాపోయారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత తమిళంలో అలాగే మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని కన్నడంలో కూడా ఆమెకు అగ్రహీరోలతో ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తుంది. మరి రష్మిక మందన ఇతర భాషల మీద ఎప్పుడు దృష్టిపెడతారు ఏంటనే దానిపై క్లారిటీ రావడం లేదు. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది త్వరలోనే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: