తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యువ దర్శకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కొంతమంది మాస్ సినిమాలతో జనాలను ఆకట్టుకుంటూ ఉంటే, కొంతమంది క్లాస్ సినిమాలతో జనాలను ఆకట్టుకుంటన్నారు. మరి కొంతమంది కామెడీ సినిమాలతో జనాలను అలరిస్తూ ముందుకు దూసుకు పోతున్నారు. ప్రేమ కథలతో కూడా కొంతమంది వెండితెరపై మ్యాజిక్ ను చేస్తూ ఉన్నారు.  అలా ప్రేమ కథలతో వెండితెరపై తనదైన గుర్తింపు సాధించకుండా దర్శకులలో ఒకరు శివ నిర్వాణ. శివ నిర్వాణ యువ దర్శకుడు నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక సున్నితమైన ప్రేమకథను అంతే సున్నితమైన స్క్రీన్ ప్లే తో తెరపై ఆవిష్కరించే అటు జనాలతో పాటు ఇటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు.

ఆ తర్వాత నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా మజిలీ అనే సినిమాను తెరకెక్కించాడు. మజిలీ సినిమా తో మంచి ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా రెండు ప్రేమ కథలతో జనాలను ఆకట్టుకున్నా శివ నిర్వాణ ఈ మధ్య కాలంలోనే టక్ జగదీష్ సినిమాతో ఒక కుటుంబ కథా చిత్రాన్ని జనాల ముందుకు తీసుకొచ్చాడు. కానీ శివ నిర్వాణ ప్రేమ కథ సినిమాలతో చేసిన మ్యాజిక్ ను కుటుంబ కథ చిత్రాలతో చేయలేకపోయాడు అని చెప్పవచ్చు. అయితే తనకు ఎంతో కలసి వచ్చిన ప్రేమ కథ నే మరొకసారి రాసుకున్నట్టు ఈమధ్యే  ఈ దర్శకుడు తెలియజేశాడు. అయితే టక్ జగదీష్ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణ ఒక సినిమాను ప్రకటించబోతున్నట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వీరిద్దరి నుండి వెలువడలేదు. దీంతో వీరిద్దరి సినిమా ఇప్పట్లో కష్టమే అని అనేక వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: