ప్రస్తుతం ఎలాంటి గ్యాప్ తీసుకోకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా చేసిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన చేస్తున్న భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కు త్రివిక్రమ్ రచయితగా పని చేస్తుండగా ఈ సినిమాలో నిత్యామీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రానా మరో కథానాయకుడుగా నటిస్తు ఉండగా ఈ ఇద్దరికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే విడుదలై సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా త్వరలోనే ఈ సినిమా పనులను పూర్తి చేయనున్నాడు పవన్. ఇక మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చాడు పవన్. ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందిస్తుండగా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 

 ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లోని భవదీయుడు భగవద్గీత సినిమా ను పవన్ త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. త్వరలోనే ఈ సినిమా నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. పవన్ ఇటీవలే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ ను అధికారకంగా ప్రకటించగా ఇది  అందరికీ బాగా నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయిన గబ్బర్ సింగ్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అన్నట్లుగా చెబుతున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: