తన కేరీర్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు ఒక్క హిట్ రాకపోవడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఆయన హీరోగా తెరంగేట్రం చేసిన అఖిల్ సినిమా దగ్గర నుంచి మొన్నటి మిస్టర్ మజ్ను సినిమా వరకు మూడు సినిమాలు చేయగా మూడు సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచాయి. దాంతో ఆయన నాలుగో సినిమాగా చేస్తున్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

సినిమా అప్డేట్ లతో అఖిల్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడగా పోస్టర్లు టీచర్లు సినిమా హిట్ అవుతాయని నమ్మకం ఏర్పరిచాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తున్నామని చిత్ర బృందం గతంలో ప్రకటించగా ఇప్పుడు విడుదల తేదీని కన్ఫర్మ్ చేసింది.  ముందుగా థియేటర్లలో అక్టోబర్ 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలపగా ఇప్పుడు అక్టోబర్ 15వ తేదీన ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు.

 దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండుగ సందర్భంగా విడుదల అయితే ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ వస్తుంది అనే నిర్ణయం తో వారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట.  వాస్తవానికి అక్టోబర్ 8వ తేదీన తక్కువ పోటీతో అయితే అఖిల్ రాగలరు.. అక్టోబర్ 15వ తేదీ అయితే రెండు మూడు సినిమాలు విడుదల ఉన్నాయి.. అది రాంగ్ డేట్ అని ఆయన అభిమానులు చెబుతున్నారు.. అక్టోబర్ 8వ తేదీన కొండపోలం ఒక్కటే విడుదల అవుతుండగా అక్టోబర్ 15వ తేదీన వరుడు కావలెను మరియు మహా సముద్రం సినిమాలు రాబోతున్నాయి. మరి అఖిల్ సోలో గా కాకుండా ఇద్దరు హీరోలతో కలిసి వచ్చి తన మొదటి హిట్ అందుకుంటాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: